పత్రం ఇవ్వాలంటే.. వంశవృక్షం చూడాల్సిందే

1 Aug, 2014 20:29 IST|Sakshi

ఆదాయ, కుల, స్థానిక ధ్రువపత్రాల జారీలో అత్యంత జాగ్రత్త వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచించారు. స్థానికత విషయంలో వంశవృక్షాన్ని చూడాల్సిందేనని, ఒక్క తప్పుడు ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇస్తే దాన్ని జారీ చేసిన అధికారులే బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు.

ఇక మీదట తెలంగాణలో మీసేవా కేంద్రాల ద్వారా ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది. ఇకపై కేవలం ఎమ్మార్వో ద్వారానే ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వం తలపెట్టిన 'ఫాస్ట్' పథకం కోసం 1956 స్థానికతను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించడంతో దానికి సంబంధించిన ధ్రువపత్రాలు అత్యంత కీలకంగా మారాయి. వీటి విషయంలోనే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు.

మరిన్ని వార్తలు