రాజయ్య.. కేసీఆర్ బినామీ

7 Aug, 2015 01:41 IST|Sakshi

 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్   భట్టి విక్రమార్క

పర్వతగిరి : సీఎం కేసీఆర్ బినామీగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పనిచేసి.. వేల కోట్లు దోచిపెట్టారని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.  అవినీతికి పాల్పడ్డ రాజయ్య... కేసీఆర్ బినామీగా పనిచేసి అల్లుడు హరీష్‌రావు, కుమారుడు కేటీఆర్, కుతూరు కవితకు వేల కోట్ల రుపాయలను అప్పగించారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేసిన విద్యార్థులు, ఉద్యమకారుల నమ్మకాన్ని సర్కారు వమ్ము చేసిందని పేర్కొన్నారు.
 
పేదల గొంతుక కాంగ్రెస్

 స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పేదల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు.  గురువారం వర్ధన్నపేటలో పార్టీ కార్యక్రమానికి హాజరై తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ మండలకేంద్రంలో కాసేపు ఆగారు. పార్టీకి చెందిన స్థానిక ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ ైజైహింద్‌రాజ్, గోనెల ఉపేందర్, యువజన సంఘం నాయకుడు అంబటి కిషన్‌రాజ్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం భట్టి విలేక రులతో మాట్లాడారు. రోజుకో హామీతో మభ్యపెడుతున్న సీఎం కే సీఆర్‌కు ప్రజా సమస్యలు పట్టడంలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో సర్కారు నిర్లక్ష్యాన్ని వీడాలని, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెపై స్పందించాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు