వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే మహాకూటమిపై మండిపాటు

8 Oct, 2018 16:52 IST|Sakshi

సాక్షి, జగిత్యాల : అకారణంగా అసెంబ్లీని రద్దు చేసి.. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా 20 రోజులుగా బయటికిరాని కే చంద్రశేఖర్‌ రావు, ఆయన కుటుంబపాలన అంతానికే మహాకూటమిగా ఒక్కటయ్యామని టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌ రమణ అన్నారు. నమ్మిన తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్‌ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎల్‌ రమణ మాట్లాడుతూ.. మహాకూటమి ఏర్పాటుతో ప్రజలకు ధైర్యం వచ్చిందన్నారు. డీకే అరుణ బండారం బయట పెడతానని హీనంగా మాట్లాడిన కేసీఆర్‌! .. నీ కూతురు బండారం బయట పెడితే సహించగలవా అని ప్రశ్నించారు. జగిత్యాలలో జీవన్‌ రెడ్డి మీద తమకు నమ్మకం ఉందని అన్నారు. జీవన్‌ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. 

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే మహాకూటమిపై మండిపాటు
జగిత్యాల : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మహాకూటమిపై మండిపడుతున్నారని మాజీమంత్రి జీవన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబపాలన నుంచి విముక్తి పొందేందుకు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగం కల్పించటానికి, రైతులకు, మహిళలకు అండగా నిలువటానికి మహాకూటమి ఏర్పడిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు