హరితసీమగా మార్చాలి

4 Jul, 2016 08:31 IST|Sakshi
హరితసీమగా మార్చాలి

అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

 జగదేవ్‌పూర్ : హరితహారాన్ని ఊరూరా ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలకు మొక్కలను అందించాలన్నారు. మెతుకు సీమను హరితసీమగా మార్చాలన్నారు. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలతోపాటు గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఆదివారం మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 10వ తేదీ నాటికి అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలన్నారు.

గజ్వేల్‌లోని కోమటిబండలో సంపు నిర్మాణ పనులపై ఆరా తీయగా, గఢా అధికారి హన్మంతరావు సంపు వివరాలను వివరించారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇళ్ల పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారంపై 123జీఓ, 2013 చట్టంపై కలెక్టర్‌తో చర్చించినట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు