20 వేల బస్సులైనా తీసుకురండి

31 Oct, 2019 03:21 IST|Sakshi

ప్రజలకు ఇబ్బంది కలగకూడదు: సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం ఎంతకీ తెగట్లేదని, ఎంతకాలం ప్రజలకు ఈ ఇబ్బందులని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పదిహేను, 20 వేల ప్రైవేటు బస్సులను రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా ప్రవేశపెట్టాలని, వాటికి రూట్‌ పర్మిట్లు జారీ చేసేందుకు కసరత్తు చేయాలని రవాణ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ సమ్మెపై బుధవారం ప్రగతి భవన్‌లో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆ శాఖ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతో సమీక్షించారు.

గురువారం హైకోర్టులో ప్రభుత్వం తరఫున దాఖలు చేయనున్న అఫిడవిట్‌ను సీఎం పరిశీలించారు. హైకోర్టు నుంచి ప్రభుత్వానికి ప్రతికూల ఆదేశాలందితే తక్షణమే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్లు తెలిసింది. సకల జన భేరీ నిర్వహించడం, విపక్ష నేతలను ఈ సభకు ఆహ్వానిచడంపై కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారని అధికారవర్గాలు తెలిపాయి.  

>
మరిన్ని వార్తలు