రాయలసీమకు నీళ్లు ఎందుకు పోవద్దు: కేసీఆర్‌

18 May, 2020 21:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సముద్రం పాలయ్యే నీళ్లు సీమకు తరలించడంలో తప్పేం లేదని, రాయలసీమకు నీళ్లు ఎందుకు పోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తెలిసీ తెలియక మాట్లాడేవారి గురించి తాను పట్టించుకోనన్నారు. నీటి వాటాలకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అందరికి మంచి జరగాలన్నదే మా ఆశ.  ప్రజల అవసరాల కోసం నీళ్లు తీసుకోవటంలో తప్పులేదు. బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవు. చంద్రబాబు బాబ్లీ బోగస్‌ పంచాయితీతో ఏం వచ్చింది?. దాని వల్ల ఒక్క టీఎంసీ కూడా సాధించలేదు. ఘర్షణ వాతావరణం ఏ రాష్ట్రానికి అవసరం లేదు. మాకు రెండు నాల్కలు లేవు. గోదావరిలో మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేద’’ని స్పష్టం చేశారు.

చదవండి : కేంద్రం తన పరువు తానే తీసుకుంది: కేసీఆర్‌ 

మరిన్ని వార్తలు