కేసీఆర్‌ త్వరలో గల్ఫ్‌ దేశాల పర్యటన

12 Oct, 2019 17:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కుటుంబాల పోషించడానికి పొట్ట చేతపట్టుకుని గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలను తిరిగి రాష్ట్రానికి రప్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో గల్ఫ్‌ దేశాల పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన గురించి ఆయన మాటల్లోనే.. ‘ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు మిగిలిన తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రజలు పని వెతుక్కుంటూ ఎడారి దేశాలకు పెద్ద ఎత్తున వలస వెళ్లారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి జీతాలు కూడా తక్కువే.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇక్కడే చేసుకోవడానికి చాలా పనుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి స్థానికంగా కార్మికులు దొరకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అందుకోసం గల్ఫ్‌ దేశాల్లో ఉన్న తెలంగాణ వారిని రప్పించి న్యాక్‌లో శిక్షణనిప్పించాలని నిర్ణయించాం.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో, బిల్డర్లతో సంప్రదించి నిర్మాణ రంగంలో వారికి పని కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదే విషయాన్ని గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ బిడ్డలకు చెప్పడానికి స్వయంగా నేనే అక్కడికి వెళ్తున్నా’నన్నారు. పర్యటనకు ముందు వలస వెళ్లిన వారు ఎక్కువగా నివసించే నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నారై పాలసీ అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆధార్‌ సిన్హాలతో కూడిన బృందం ఆదివారం కేరళలో పర్యటించనుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బస్సులపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికులు

వారికి మాత్రమే జీతాలు : కేసీఆర్‌

తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు

19న తెలంగాణ బంద్‌

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

నల్లా లెక్కల్లో!

ఆర్టీసీ సమ్మె: తీవ్ర ఉద్రిక్తత, లక్ష్మణ్ అరెస్ట్‌

ప్రైవేట్‌ కండక్టర్ల చేతికి టికెట్‌ మెషిన్లు

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని చెప్పలేదు: పువ్వాడ

బీఆర్‌ఎస్‌ గుడ్‌న్యూస్‌

కల్తీపాల కలకలం

నాట్యంలో మేటి.. నటనలో సాటి

బట్టలు చించేలా కొట్టారు..

విద్యావేత్త అయోధ్య రామారావు మృతి

ఆర్టీసీ సమ్మెకు సింగరేణి కార్మికుల మద్దతు

తెలంగాణలో చీకటి పాలన

ఆర్టీసీ సమ్మె: బస్‌భవన్‌ ఎదుట ధర్నా

దేశం మెచ్చిన సీఎం.. కేసీఆర్‌

శ్వేత.. వన్‌డే కమిషనర్‌

ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం

సరిహద్దుల్లో అప్రమత్తంగా వరంగల్‌ పోలీసులు

గుండెబోయిన రాంమూర్తి యాదవ్ కన్నుమూత

తాత్కాలిక డ్రైవర్‌కు ఫిట్స్‌

నాయీ బ్రాహ్మణుల అలయ్‌ బలయ్‌

దరఖాస్తుల ఆహ్వానం

ఎంగిలి ప్లేట్లు తీసిన న్యాయమూర్తి 

నాంపల్లి ఎం.జే మార్కెట్‌ వద్ద అగ్ని ప్రమాదం

10 రోజులు..162 ప్రత్యేక రైళ్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ హీరోయిన్లకే భారీ రెమ్యునరేషన్‌ : ప్రియమణి

మధుర జ్ఞాపకాన్ని షేర్‌ చేసిన జాన్వీ

ఆ హీరో నా స్కర్ట్ లో చేయి పెట్టాడు

బిగ్‌బాస్‌ : ‘అతడు’ ఎలిమినేటెడ్‌!

ప్రముఖ హాలీవుడ్‌ నటుడి మృతి

విజయ్‌దేవరకొండతో చేయాలనీ కోరిక..