కేసీఆర్‌ వచ్చాకే రైతుకు భరోసా

8 Apr, 2019 15:22 IST|Sakshi
రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

70ఏళ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీ ఏమీ చేయలేదు

రాయపర్తి  రోడ్‌షోలో మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు 

సాక్షి, రాయపర్తి: కేసీఆర్‌ వచ్చాకే రైతుకు భరోసా వచ్చిందని, 70యేళ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీలేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి రాయపర్తి మండలకేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో వరంగల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చేపట్టిన పథకాలను చూసి ప్రక్క రాష్ట్రాల్లో ఎందుకు చేయడంలేదని ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ వచ్చే పరిస్థితిలేదన్నారు.

గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌ ఏ పార్టీ కల్పించలేదని తెలిపారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన 24గంటల కరెంట్, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్టు, భూప్రక్షాళన, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ఉపాధి హామీని వ్యవసాయ పనులకు అనుసంధానం చేసే పనిలో ఉన్నామన్నారు. దేశప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. 35యేళ్ల  నుంచి నన్ను ఆశీర్వదించారని ఇన్నేళ్ల నుంచి గెలిపించింది ఒకెత్తయితే మొన్నటి ఎన్నికలు ఒకెత్తని, మీరు నన్ను ఆశీర్వదించినందుకు ఎప్పటికి రుణపడి ఉంటానన్నారు.  

ఉద్యమకారుడు మంచి పేరున్న వ్యక్తి మన ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పసునూరి దయాకర్‌ మాట్లాడు తూ ఉద్యమకారుడిగా నన్ను గుర్తించి నాకు సీఎం కేసీఆర్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చి గెలిపించారని, మళ్లీ అవకాశం ఇచ్చారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పరంజ్యోతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జినుగు అనిమిరెడ్డి, గోపాల్‌రావు, నర్సింహానాయక్, ఎంపీపీ యాకనారాయణ, సురేందర్‌రావు, రంగు కుమార్, గారె నర్స య్య, ఉస్మాన్, నయీం, వనజారాణి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు