కనీస చార్జీ రూ.10

1 Dec, 2019 05:15 IST|Sakshi

పల్లెవెలుగు, సిటీబస్సుల్లో అమలుకు సీఎం ఆమోదం

మిగిలిన సర్వీసుల్లో కిలోమీటర్‌కు 20 పైసల పెంపు

నేడు డిపోలకు కొత్త చార్జీల వివరాలు

మంగళవారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం

అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం

నేడు డిపో ప్రతినిధులతో ఆత్మీయ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు ఖరారయ్యాయి. పల్లె వెలుగుతోపాటు హైదరాబాద్‌ సిటీ బస్సుల కనీస చార్జీ రూ.10గా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో స్టేజీలవారీగా టికెట్‌ ధరలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొత్త చార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత సోమవారం నుంచి అమలు చేద్దామని భావించినా.. సీఎం సూచన మేరకు దాన్ని మంగళవారానికి మార్చినట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రగతి భవన్‌లో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.

ప్రస్తుతానికి ఆర్టీసీని ఉన్నది ఉన్నట్టుగానే ఉంచాలని నిర్ణయించిన తర్వాత ఇదే తొలి భేటీ. సంస్థను పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు అవలంభించాలనే విషయంలో ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చార్జీల అంశం కూడా చర్చకు వచి్చంది. అన్ని కేటగిరీల బస్సులకు కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచుకునేందుకు ఇటీవల ముఖ్యమంత్రి అనుమతించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న ధరలకు అదనంగా కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచి, చిల్లర సమస్య రాకుండా రౌండింగ్‌ ఆఫ్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. దానికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు.  

చార్జీలు ఇలా పెరుగుతాయి..
పల్లెవెలుగు, సిటీ బస్సులకు సంబంధించి ప్రస్తుతం కనీస చార్జీ రూ.5గా ఉంది. దాన్ని రూ.10కి పెంచాలని అధికారులు నిర్ణయించి సీఎంకు తెలియజేశారు. ఎండీ స్థాయిలో మాట్లాడుకుని నిర్ణయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కనిష్ట చార్జీ రూ.5 ఉండగా, 2 నుంచి ఐదో స్టాప్‌ వరకు రూ.10 ఉంది. ఇప్పుడు కనిష్ట చార్జీని రూ.10గా మార్చి, కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచితే మూడో స్టాపులో ఆ మొత్తం రూ.12.6గా మారు తుంది. దాన్ని రౌండింగ్‌ ఆఫ్‌ చేసి రూ.15గా ఖరారు చేస్తారు. ఇలా నాలుగు స్టాపులకు రూ.5 చొప్పున పెంచుతారు. పల్లె వెలుగులో కనిష్ట చార్జీ రూ.10గా మార్చి, ఐదు కిలోమీటర్ల తర్వాత రూ.15గా మారుస్తారు.

మిగతా సర్వీసులకు ఉన్న చార్జీపై కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున జత చేస్తారు. వాటికి కూడా చిల్లర సమస్య రాకుండా రౌండింగ్‌ ఆఫ్‌ చేస్తారు. ఆదివారం కొత్త చార్జీలు సిద్ధంచేసి డిపోలకు పంపిస్తారు. డిపోలో ఆయా చార్జీలను టిమ్‌ యంత్రాల్లో ఫీడ్‌ చేయాల్సి ఉంది. ఈ కసరత్తులో జాప్యం జరిగితే సోమవారం నుంచి అమలు చేసే అవకాశం లేదు. పైగా మంగళవారం తిథి పరంగా మంచి రోజు అనే అభిప్రాయంతో ఆ రోజు నుంచే కొత్త చార్జీలు అమలులోకి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది.

పోటీతత్వాన్ని పెంచుకోవాలి...
కష్టపడి పనిచేసే సిబ్బంది ఉన్నందున పోటీతత్వాన్ని పెంచుకుని ఆర్టీసీ ఆదాయం పెరిగేలా అధికారులు కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు సరీ్వసులు లాభాల్లో ఉన్నప్పుడు ఆర్టీసీ సరీ్వసులు నష్టాల్లో ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో అధికారులు–కారి్మకుల మధ్య మంచి సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు. అవసరమైతే సిబ్బందితో ఓ గంట ఎక్కువగా పని చేయించుకునేందుకు అవకాశం కలుగుతుందని, అది సత్ఫలితాలనిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పార్శిల్‌ సరీ్వసులకే పరిమితమైన ఆరీ్టసీ.. సరుకు రవాణాపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వాణిజ్య అవసరాలకు వీలుగా లీజుకు ఇచ్చే విషయంపై పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వాటిని ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని పేర్కొన్నారు.  

నష్టాలకు బాధ్యులపై చర్యలు తీసుకోండి
డిపో స్థాయి ప్రతినిధులో సమీక్ష నేపథ్యంలో, ఆర్టీసీ నష్టాలకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునే విషయంపై సీఎం దృష్టి సారించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరక్టర్‌ నాగేశ్వరరావు కోరారు. రెండు సంవత్సరాల కాలానికి ట్యాక్స్‌ హాలీడే ప్రకటించాలని, సాలీనా 6% చార్జీలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని, సమర్ధుడైన ఎండీ ని నియమించి, నెలవారీ ఆర్టీసీ బకాయిలు చెల్లించాలని ఓ ప్రకటనలో కోరారు. కాగా, సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించాలని ఎన్‌ఎంయూ నేతలు కమాల్‌రెడ్డి, అశోక్‌ విజ్ఞప్తి చేశారు. శంషాబాద్‌లో యువతి అత్యాచారం, హత్య నేపథ్యంలో మహిళా కండక్టర్లకు సాయంత్రం లోపు విధులు పూర్తయ్యేలా డ్యూటీ లు వేయాలని కోరారు.  

నేడు కార్మికులతో సీఎం భేటీ...
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగతి భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు డిపో ప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్‌ కారి్మకులను ఈ సమావేశానికి ఆహా్వనించారు. కారి్మకులతో కలిసి సీఎం మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి శనివారం ప్రగతి భవన్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. కార్మికులతో నిర్వహించే సమావేశంలో ఎటువంటి చర్చ జరగాలి? కార్మికులు, సంస్థ అధికారులు.. ప్రభుత్వం నుంచి ఆశించే అంశాలు ఏమిటి? అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలు ఏమిటి? అన్న అంశాలపై చర్చించారు. సంస్థలో సుదీర్ఘ అనుభవం కలిగిన కారి్మకుల క్షేత్ర స్థాయి అనుభవాలను తెలుసుకోవడం ద్వారా ఆర్టీసీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా