తండ్రి ఫామ్‌హౌస్‌కు తనయుడు అమెరికాకు

24 Nov, 2018 15:13 IST|Sakshi
జంగంపల్లిలో ప్రచార ర్యాలీ మాట్లాడుతున్న షబ్బీర్‌ అలీ    

ఓటమిని ముందే ఒప్పుకున్న కేసీఆర్‌ 

శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌అలీ 

బిక్కనూరు : అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పామ్‌హౌజ్‌కు, ఆయన తనయుడు కేటీఆర్‌ అమెరికాలో రెస్టు తీసుకుంటారని కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగంపల్లిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ప్రజలు నాల్గున్నర ఏళ్లుగా కేసీఆర్‌ నియంత పాలనను కళ్లార చూశారని ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను పాతర పెట్టెందుకు ఇప్పటికే సిద్ధమయ్యారన్నారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయం కాగా మూటలు కట్టుకోవడం ప్రజా ధనాన్ని దోచుకోవడం టీఆర్‌ఎస్‌ లక్ష్యమన్నారు. షబ్బీర్‌అలీకి గ్రామస్తులు బోనాలతో ఘన స్వాగతం పలికారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి, పీసీసీ కార్యదర్శులు ఇంద్రకరన్‌రెడ్డి, నల్లవెళ్లి అశోక్, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు లింబాద్రి, కుంట చిన్నమల్లారెడ్డి, నేతలు పుల్లురి రామస్వామి, నర్సింలు, బాల్‌నర్సవ్వ, సుదర్శన్, నాగభూషణంగౌడ్, సిద్దగౌడ్, అంకం రాజు, లింగారెడ్డి, ఎల్లారెడ్డి ఉన్నారు.  

అప్పుల ఊబిలో రాష్ట్రం  ఘనత కేసీఆర్‌దే 
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకపోవడానికి సీఎం కేసీఆర్‌ కారణమని మాజీ ప్రభుత్వ విప్‌ సయ్యద్‌ యూసుప్‌ అలీ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగంపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ తరపున ప్రచారం చేశారు. కోట్లాడి సాధించుకున్న రాష్ట్రం ద్రోహుల చేతిలో తల్లడిల్లుతుందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు. రైతుబంధు చెక్కులు 30 శాతం మందికి ఇంకా అందలేదన్నారు. తాత ముత్తాతల నుంచి భూములు ఉన్న రైతులకు రైతుబంధు పథకం వర్తించలేదని, రియల్టర్లకు, భూములు క్రయవిక్రయాలు చేసే వారికి మాత్రం రైతుబంధు చెక్కులు అందాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నేతలు రాకేష్, భూమయ్య, సిద్దరాములు ఉన్నారు.  

మరిన్ని వార్తలు