మోదీ-కేసీఆర్‌ భేటీ; అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌

13 Jun, 2018 20:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 2:30 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఖరారయినట్లు తెలిసింది. తెలంగాణలో నూతనంగా తీసుకొచ్చిన జోనల్‌ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని మోదీని కేసీఆర్‌ కోరనున్నారు.

గతంలో దొరకని అపాయింట్‌మెంట్‌: వాస్తవానికి గత నెలలోనే సీఎం కేసీఆర్‌.. పీఎం మోదీని కలవాల్సింది. ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ ఏకంగా నాలుగు రోజులు అక్కడే మకాం వేశారు. కానీ ఎంతకీ ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో హైదరాబాద్‌ వెనుదిరిగారు. అదే సమయంలో మోదీ.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాళేశ్వరం.. బ్రహ్మాస్త్రం!

వైఎస్సార్‌ సీపీకి 120-130 సీట్లు

‘నాకన్నా సమర్థుడికి టికెట్‌ ఇవ్వాల్సింది’

అభివృద్ధి వైపు అడుగులు

ఈవీఎం, వీవీఫ్యాట్లపై అవగాహన 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’ టైటిల్‌ లోగో లాంచ్‌

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సైరా కోసం బన్నీ..!

సమ్మరంతా సమంత