రేపు ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ సమావేశం

30 Nov, 2019 02:17 IST|Sakshi

ప్రతి డిపో నుంచి ఐదుగురికి ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్‌ 1 ఆదివారం ప్రగతిభవన్‌లో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మను సీఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో కచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని, అన్ని వర్గాలకార్మికుల భాగస్వా మ్యం ఉండేలా చూడాలని కోరారు.

డిసెంబర్‌ 1 మధ్యాహ్నం 12 గంటలకల్లా కార్మికులను ప్రగతి భవన్‌కు తీసుకురావాలని, వారికి అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామ ని చెప్పారు.అనంతరం కార్మికులతో సీఎం నేరుగా మాట్లాడతారు. ఆర్టీసీకి చెందిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చిస్తారు. సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్‌ కుమార్‌తోపాటు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ, ఈడీ లు, ఆర్‌ఎంలు, డీవీఎంలను ఆహ్వానించారు.

సీఎంకు రవాణా మంత్రి కృతజ్ఞతలు 
ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకోవడానికి అనుమతించిన సీఎం కేసీఆర్‌కు రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్‌లో శుక్రవా రం సీఎంను మంత్రి కలిశారు. ఆర్టీసీని కాపాడటానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చినందుకు, కార్మికులతో నేరుగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బడ్జెట్‌లో డబ్లింగ్‌కు రూ.200 కోట్లు..  

ప్రియాంక హత్య: ‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు! 

పురపోరుకు సిద్ధం

సిటీకి ‘డిసెంబర్‌’ మానియా

నేటి ముఖ్యాంశాలు..

‘మున్సిపోల్స్‌’కు ముహూర్తం..! 

పెళ్లి చేసుకోకుంటే చంపేస్తా..

ఆరేళ్ల చిన్నారిపై బాలుడి లైంగికదాడి 

మనసున్న మారాజు కేసీఆర్‌: పల్లా

కాళేశ్వరానికి.... ‘అనంత’ కష్టాలు

పోలీసుల తీరుపై మహిళా కమిషన్‌ అసంతృప్తి 

రూ. 700 కోట్లతో ‘స్కైవర్త్‌’ ప్లాంట్‌

స్కూటీ అక్కడ.. నంబర్‌ ప్లేటు ఇక్కడ

పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా?

సిటీ బస్సులు కుదింపు!

ఉలిక్కిపడ్డ నారాయణపేట

సిటీ, పల్లె వెలుగు కనీస చార్జీ రూ.10

విధులకు 7 నెలల గర్భిణి

శంషాబాద్‌లో మరో ఘోరం

హైకోర్టు సూచనతోనే సమ్మె విరమించాం

బస్సెక్కారు.. బిస్స పట్టారు

28 నిమిషాల్లోనే చంపేశారు!

శంషాబాద్‌లో మరో దారుణం..

ప్రియాంక హత్య; 40 నిమిషాల్లోనే ఘోరం

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే: సీపీ సజ్జనార్‌

ఆడపిల్లల తండ్రిగా బాధతో చెబుతున్నా: పొంగులేటి

ప్రియాంక ఇంటి వద్ద ఉద్రిక్తత 

‘ఆర్టీసీని వాడుకుని రాజకీయం చేయలేదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘షరతు ప్రకారం మగవారితో మాట్లాడలేదు’

మా అమ్మకు అటిట్యూట్‌ ప్రాబ్లం.. అందుకే..

పాటల సందడి

ప్రతి సీన్‌లో నవ్వు

బిజీ తాప్సీ

పరిశోధకుడు