నాకు ధైర్యం ఎక్కువ : కేసీఆర్‌

17 Sep, 2017 14:50 IST|Sakshi
నాకు ధైర్యం ఎక్కువ : కేసీఆర్‌

హైదరాబాద్‌ :
ప్రగతి భవన్‌లో ఆదివారం పాల ఉత్పత్తిదారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. 60 ఏళ్లగా అస్తవ్యస్థపాలన సాగిందని, వేరుపడ్డ సంసారం బాగుపడడానికి సమయం పడుతుందన్నారు.

'నాకు ధైర్యం ఎక్కువ. రెండేళ్లలో గోదావరి నీళ్లతో మీ కాళ్లు కడుగుతా. గోదావరి నీళ్లొస్తే చెరువులు నిండుతయి. తెలంగాణలో కోటి మూడు లక్షల కుటుంబాలున్నాయి. అంటే కోటి లీటర్ల పాలు అవసరం. కానీ, రాష్ట్రంలో 7 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 7 లక్షల మంది యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. మొదటి దశలో 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. గొర్రెల పెంపకంతో గొల్ల కుర్మలు బాగుపడుతున్నారు.

హైదరాబాద్‌కు రోజు 350 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. తెలంగాణలో 650 లారీల గొర్రెల్ని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రోజు 40 లారీల చేపలు హైదరాబాద్‌కు దిగుమతి అవుతున్నాయి. రైతులకు ఎరువుల కొరత లేకుండా చేస్తున్నాం. గ్రామాల్లో భూముల సర్వే జరుగుతోంది. భూముల సర్వేకు రైతులు సహకరించాలి. భూముల లెక్క తేలితే ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి ఇస్తాం' అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు