పెత్తనం కుదరదు

9 Aug, 2014 02:01 IST|Sakshi

* కేంద్రంపై కేసీఆర్ ఫైర్
* మోడీ ఫాసిస్టు చర్యలను ఖండిస్తున్నట్లు వ్యాఖ్యలు
* ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిక
 
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం తాజాగా పంపిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ ఆదేశాలను అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కబళించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫాసిస్టు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కూడా లేఖ రాయాలని ప్రధాన కార్యదర్శికి సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపించాలని, త్వరలోనే సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వివరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు ధోరణిని ప్రతిఘటించేందుకు ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్రం పంపిన లేఖలోని అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను అమలు చేయమని ప్రకటించారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కల్పించాలని, అందుకు అవసరమైన విధంగా తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేసుకోవాలని గత నెలలోనే కేంద్ర హోం శాఖ నుంచి లేఖ వచ్చిన సంగతి తెలిసిందే.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉమ్మడి పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని, ఇరు రాష్ట్రాల డీజీపీలతో కమిటీ వేయడంతోపాటు, నగరంలో పోలీసు అధికారుల నియామకానికి సంబంధించి ఇరు రాష్ట్రాల వారిని పరిగణించాలని అందులో సూచించింది. దీనికి రాష్ర్ట ప్రభుత్వం కూడా ఘాటుగానే బదులిచ్చింది.

రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉన్న ప్రకారం నడచుకుంటామే తప్ప.. గవర్నర్‌కు అధికారాలు కల్పించేలా బిజినెస్ రూల్స్‌ను మార్చబోమని తేల్చి చెప్పింది. ఇదంతా జరిగిన  నెల రోజుల తర్వాత కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ పేరిట శుక్రవారం రాత్రి మరో లేఖ రాష్ర్ట ప్రభుత్వానికి అందింది. అయితే ఇందులో ఇరు రాష్ట్రాల పోలీసుల అధికారులను నియమించాలన్న నిబంధనను తొలగించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్లాబ్‌ మీద పడటంతో బాలుడు మృతి..!

ప్రాణం పోయినా మాట తప్పను 

నడిగడ్డను దోచుకున్నారు..

మొదలైన ఉజ్జయినీ మహంకాళి బోనాలు 

ఎయిర్‌పోర్టు ఆశలకు రెక్కలు..! 

హలంపట్టి.. పొలం దున్నిన 

మైసమ్మతల్లి విగ్రహం అపహరణ

బావిలో పడిన దుస్తులు తీయబోయి..

బాయిమీది పేరే లెక్క.. 

‘కేసీఆర్‌ సారు, కేటీఆర్‌ సారు ఉండవు’

కొలువిచ్చారు సరే.. జీతాలు మరీ..?

‘కొత్తగా సీఎం అయినట్లు మాట్లాడుతున్నారు’

వ్యవసాయ శాస్త్రవేత్తగా రైతు బిడ్డ 

‘డబ్బు’ల్‌ ధమాకా! 

‘పేదలకు ఏం కావాలో సీఎంకు తెలుసు’

సీపీఐ కొత్త సారథి డి.రాజా

వరద వదలదు.. ట్రాఫిక్‌ కదలదు

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మొండి వైఖరి వద్దు

8 నిమిషాలు.. 80 వేల కణాలు

ఈడబ్ల్యూఎస్‌ మెడికల్‌ సీట్లకు కౌన్సెలింగ్‌

ఆరోగ్య తెలంగాణే ధ్యేయం

నిండైన పదజాలం గోరా శాస్త్రి సొంతం 

రాకాసి పట్టణం

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

సోషల్‌ మీడియా: కెరీర్‌కు సైతం తీవ్ర నష్టం

వీఆర్వో వ్యవస్థ రద్దు?

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

​​22న కేసీఆర్‌ చింతమడక పర్యటన

ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా