'ఆ పీఎస్, పీఏలను మంత్రులెవరూ పెట్టుకోవద్దు'

11 Jun, 2014 14:13 IST|Sakshi
'ఆ పీఎస్, పీఏలను మంత్రులెవరూ పెట్టుకోవద్దు'

హైదరాబాద్ : గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన పీఎస్ (పర్సనల్ సెక్రటరీ), పీఏ(పర్సనల్ అసిస్టెంట్)లను ప్రస్తుత మంత్రులెవరూ నియమించుకోరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఒకవేళ వారిని నియమించుకుంటే వెంటనే తొలగించాలని కేసీఆర్ బుధవారం మంత్రలకు ఆదేశాలు ఇచ్చారు. కొత్తవారిని నియమించుకోవాలని కేసీఆర్  ఈనేపథ్యంలో మంత్రులకు స్పష్టం చేశారు. దాంతో మంత్రులు తమ పేషీల్లో కొత్తవారిని,పాలనాపరంగా అనుభవం ఉన్నవారినే నియామించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

 

మరిన్ని వార్తలు