పుట్టినరోజు వేడుకలు వద్దు  

16 Feb, 2019 02:34 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేకమంది జవాన్లు మరణించడంతోపాటు చాలామంది తీవ్రంగా గాయపడటంపై సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కశ్మీర్‌లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

కేసీఆర్‌కు రాష్ట్రపతి శుభాకాంక్షలు.. 
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రికి లేఖ పంపారు. సీఎం కేసీఆర్‌ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతికి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.   

ప్రభుత్వానికి కొత్త అటవీ చట్టం ముసాయిదా 
న్యాయ శాఖ పరిశీలించాకసీఎం గ్రీన్‌ సిగ్నల్‌ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అడవు లు, వన్యప్రాణుల సంరక్షణకు ఉద్దేశించి కఠిన నిబంధనలు, చర్యలు ప్రతిపాదిస్తూ సిద్ధం చేసి న కొత్త అటవీ చట్టం ముసాయిదాను శుక్రవారం రాష్ట్ర న్యా య వ్యవహారాల శాఖకు అటవీశాఖ సమర్పించింది. ఈ చట్టంలో చేసిన ప్రతిపాదనలను న్యాయ శాఖ పరిశీలించి, ఏవైనా మార్పులు సూచిస్తే.. ఆమేరకు మార్పులు చేయనుంది. అడవుల పరిరక్షణకు ప్రతిపాదిత చట్టంలో ఆయా అంశాలను అటవీశాఖ చేర్చింది. ఈ ప్రతిపాదనలకు న్యా య శాఖ ఆమోదం తెలిపాక, సీఎం కేసీఆర్‌ పరిశీలన కోసం పంపిస్తారు. ముసాయిదా చట్టంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తే ఈ నెల 22 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించే అవకాశాలున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు