'వాటర్ గ్రిడ్'పై కేసీఆర్ సమీక్ష

16 Oct, 2016 20:16 IST|Sakshi
'వాటర్ గ్రిడ్'పై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: దళిత వాడల నుంచే ఇంటింటికి మంచినీరు అందించే కార్యక్రమం చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వాటర్ గ్రిడ్ పథకంపై ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ కోసం అన్ని మోటార్లను బీహెచ్ఈఎల్ నుంచి కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

2017 డిసెంబర్ నాటికి గోదావరి, కృష్ణా నీళ్లు ఇంటింటికి చేరేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వాటర్ గ్రిడ్ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనుకున్న వేగంతో పనులు జరగని చోట వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు పూర్తి చేయాలన్నారు. నీరు పారుదల ప్రాజెక్టుల నుంచి 10 శాతం నీటిని వాడాలని కేసీఆర్ సూచించారు.

>
మరిన్ని వార్తలు