శ్రీనివాస్‌గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

17 Mar, 2020 04:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ జన్మదినం సందర్భంగా సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసన సభ కమిటీ హాల్‌లో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు శ్రీనివాస్‌గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు