'తెలంగాణ అభివృద్ధికి సింగపూర్ సహకారం'

8 Sep, 2014 18:57 IST|Sakshi
'తెలంగాణ అభివృద్ధికి సింగపూర్ సహకారం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ సహాయాన్ని తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ తో మాజీ ప్రధాని గో చోక్ టోంగ్ సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య అభివృద్ధి, పెట్టుబడుల అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇటీవల సింగపూర్ లో పర్యటించిన సీఎం కేసీఆర్ ఆ దేశ అభివృద్దిని చూసి ఇంప్రెస్ అయిన సంగతి తెలిసిందే. 
 
తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వంగా ఉంటుందని కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సింగపూర్ అధికార బృందం కేసీఆర్ ను కలిసి వివిధ అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. 
>
మరిన్ని వార్తలు