వైఎస్సార్‌ను కేసీఆర్‌ ఆదర్శంగా తీసుకోవాలి

11 Jun, 2018 13:46 IST|Sakshi
చింతకుంటలో ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న డా.నగేశ్‌

సాక్షి,కొత్తపల్లి (కరీంనగర్‌) : నిరుపేద ముస్లింలకు ఉద్యోగ, విద్య అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ల అమలులో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కె.నగేశ్‌ సూచించారు. కొత్తపల్లి(హెచ్‌) మండలం చింతకుంట, శాంతినగర్‌ మసీదుల్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్‌ విందులో పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్న 12 శాతం రిజర్వేషన్‌ అమలుకు కేంద్రంపై కేసీఆర్‌ ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. కేవలం దుస్తులు, విందులతో సంతృప్తిపరిస్తే ముస్లింల పేదరికం పోదని, ఓటు బ్యాంకుగా వినియోగించుకోకుండా వారికి ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్‌ అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ అహ్మద్‌ బేగ్, పట్టణ కార్యదర్శి సుంకరి సునీల్‌కుమార్, నాయకుడు ఎండీ సర్ఫోద్దీన్‌ పాల్గొన్నారు. 


తెలంగాణలో ఆర్థిక దోపిడీ
గంగాధర(చొప్పదండి) : రాష్ట్రంలో అవసరం లేని నియామకాలు చేస్తూ రూ.లక్షల వేతనాలు, మంత్రి హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నగేశ్‌ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ ప్రతినిధులు, సలహాదారులున్నా.. రాజకీయ పునరావాసం కల్పించడానికి నియామకాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో ఇరువురు ప్రభుత్వ ప్రతినిధులుండగా.. వారికే ఎలాంటి పనులు లేకున్నా మరో వ్యక్తి జగన్నాథంను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనులు మానుకొని ఇలాంటి నియామకాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని అన్నారు.  

మరిన్ని వార్తలు