నేడు గజ్వేల్‌లో కేసీఆర్‌ పర్యటన

11 Dec, 2019 04:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ములుగులో ఫారెస్ట్‌ కాలేజీ, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నూతన భవన ప్రారంభోత్సవంతోపాటు, ములుగులోని శ్రీ కొండాలక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థకు, గజ్వేల్‌ టౌన్‌లో వంద పడకల మాతా–శిశు ఆసుపత్రికి శంకుస్థాపన, గజ్వేల్‌ టౌన్‌లోని మహతి ఆడిటోరియం ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఉదయం 11కి సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఫారెస్ట్‌ కాలేజీకి చేరుకుంటారు. ఈ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం అక్కడే ఫారెస్ట్‌ అధికారులు, విద్యార్థులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి హార్టికల్చర్‌ యూనివర్సిటీకి చేరుకుని అక్కడ కొత్తగా నిర్మించిన గుడిలో పూజలు నిర్వహించి, విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత గజ్వేల్‌ పట్టణంలో సమీకృత మార్కెట్‌ను, సమీకృత కార్యాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. అనంతరం గజ్వేల్‌ మున్సిపాలిటీ అండర్‌గ్రౌండ్‌ వ్యవస్థకు, వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన, మహతి ఆడిటోరియం ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. గజ్వేల్‌ టౌన్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి సాయంత్రం 4.30 గంటలకు సీఎం ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.

మరిన్ని వార్తలు