ప్రధాని మోదీకి కేసీఆర్ రెండు లేఖలు

3 Feb, 2015 20:03 IST|Sakshi
ప్రధాని మోదీకి కేసీఆర్ రెండు లేఖలు

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం తగినన్ని బొగ్గు క్షేత్రాలు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్ కోరారు. రానున్న 4 నెలల్లో తెలంగాణ తీవ్ర విద్యుత్ కొరత ఉంటుందని, కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి కేసీఆర్ రెండు లేఖలు రాశారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి తీవ్రమైన విద్యుత్ ఉందని, ఉత్తరాది గ్రిడ్ మిగులు విద్యుత్ ను తమ రాష్ట్రానికి కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. విభజన ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం గౌరవించకపోవడం వల్లే తెలంగాణ ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కనీసం 500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ప్రధానికి రాసిన లేఖ ప్రతిని కేంద్ర విద్యుత్ మంత్రి పియూష్ గోయల్ కూడా కేసీఆర్ పంపారు.

మరిన్ని వార్తలు