రాష్ట్రం  సుభిక్షంగా ఉండాలి

19 Nov, 2018 01:50 IST|Sakshi

ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం  

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ యాగం ఆదివారం ప్రారంభమైంది. సోమవారం ఉదయం 11.11 గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది. అదే రోజు ఏకరాత్రి దీక్షలు ఉంటాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, తెలంగాణ అభివృద్ధి కోసం తలపెట్టిన కార్యాలు పరమేశ్వరుడి ఆశ్వీరాదంతో దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం తలపెట్టారు. రాజశ్యామల యాగంలో భాగంగా సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, అన్ని విగ్రహాలకు హోమాలు, చండీయాగం నిర్వహించారు. విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 75 మంది రుత్వికులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు