ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్

26 Oct, 2015 19:45 IST|Sakshi

నీతీ ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించనున్న ఆయన విధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ర్టాల్లో అమలుచేసే పథకాలపై నివేదికను ప్రధాని నరేంద్రమోదీకి అందచేస్తారు.


 కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరి లను  మంగళవారం కలవనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ర్టానికి నిధుల పెంపు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుపై ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.
 
పనిలో పనిగా.. డిసెంబర్ 23 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆయుత మహా చండీ యాగం లో పాల్గొనాల్సిందిగా.. రాష్ట్ర పతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోడీలను ఆహ్వానించనున్నారు.  సీఎం వెంట ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్ వెళ్లనున్నారు.

 

మరిన్ని వార్తలు