వీరు నవ్వితే.. నవరత్నాలు

29 Aug, 2019 03:07 IST|Sakshi

చిన్నారులపై అధ్యయనంలో టాప్‌లో కేరళ 

తెలంగాణ, ఏపీల పరిస్థితి మధ్యస్థం

ఆరోగ్యం, విద్య తదితర 24 ప్రమాణాల ఆధారంగా సర్వే

సాక్షి, హైదరాబాద్‌ :  ఏ ఇంట్లో అయినా పసిపాప బోసినవ్వు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. సమస్యలెన్ని ఉన్నా మరచిపోయేలా చేస్తుంది. అంత శక్తి ఉన్న బోసినవ్వులో దేశంలో కేరళ తొలిస్థానంలో ఉంది. ఆరోగ్యం, విద్య, చిన్నారులపై హింస లాంటి 24 ప్రభుత్వ ప్రమాణాల ఆధారంగా, చిన్నారుల శ్రేయస్సు కొలమానంగా జరిపిన తాజా పరిశోధనలో చివరి స్థానంలో మధ్యప్రదేశ్‌ ఉంది. వరల్డ్‌ విజన్‌ ఇండియా, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం ‘ద ఇండియన్‌ చైల్డ్‌ వెల్‌ బీయింగ్‌ రిపోర్టు’ని తాజాగా విడుదల చేసింది. వివిధ ప్రమాణాల ఆధారంగా పసిపాపల ఆనందాన్ని కొలిస్తే.. టాప్‌ 3 రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ వరుసగా నిలిచాయి.  

అధ్యయన అంశాలివి... 
శిశు మరణాలు, పసివారి మానసిక ఆరోగ్యం, బాలబాలికల నిష్పత్తిలో వ్య త్యాసం, చిన్నవయసులోనే గర్భం దాల్చ డం, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను అధ్యయనంలో కొలమానాలుగా తీసుకు న్నారు. విద్య విషయంలో డ్రాపౌట్‌ రేటు , టెన్త్‌ ఉత్తీర్ణత, తరగతి గదిలో పిల్లలు, టీచర్ల నిష్పత్తి, గణితంలో నైపుణ్యాలను ప్రమాణాలుగా తీసుకున్నారు. చిన్నారుల నేర ప్రవృత్తి, బాలకార్మిక వ్యవస్థ, చిన్నారుల్లో ఆత్మహత్యాశాతాన్ని అంచనా వేసింది. ఇళ్లులేని చిన్నారులూ, 5,000 కన్నా తక్కువ ఆదాయం కలిగిన పనులు చేసుకుంటోన్న చిన్నారుల తల్లిదండ్రుల పని పరిస్థితులనూ అధ్యయనం చేశారు.  

కేరళ టాప్‌... 
పౌష్టికాహారం, పసివారి ఆరోగ్య సం రక్షణ విషయంలో, రక్షిత మంచినీటి విషయంలో, సానిటేషన్‌ విషయంలో కేరళ చాలా ముందుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి మంచి స్కోరుని సాధించింది. చివరి స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో చిన్నారుల శ్రేయస్సు, పౌష్టికాహారం, జువైనల్‌ క్రైమ్స్‌ వంటివి వారి శ్రేయస్సును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. జార్ఖండ్‌లో చిన్నారులు ఎత్తు కు తగిన బరువు లేరు. ఆస్పత్రుల్లో ప్రస వాలు తక్కువగా నమోదయ్యాయి. ఐదేళ్లలోపే చిన్నారులు మరణిస్తున్నట్లు అధ్యయనం గుర్తించింది. జార్ఖండ్‌లో స్కూల్‌ డ్రాపౌట్‌ రేట్‌ కూడా అధికంగా ఉంది

ఈశాన్య రాష్ట్రాల్లో పసివారు సురక్షితం... 
ఈశాన్య రాష్ట్రాల్లో పసివారి పెరుగుదల క్షేమకరంగా ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. లింగ నిష్పత్తి సైతం ఇక్కడ మెరుగ్గా ఉంది. హింసలో పాల్గొంటున్న పిల్లలు తక్కువే. నాగాలాండ్‌లో అత్యధిక జననాలు నమోదవుతున్నాయి. పిల్లల ఆత్మహత్యలు కూడా తక్కువే. సిక్కిం ఇందుకు పూర్తి భిన్నం. చిన్నారుల్లో నేరప్రవృత్తి ఎక్కువగా ఉండటం, పిల్లల ఆత్మహత్యలు అధికంగా నమోదవుతున్నాయి. దేశంలోని మొత్తం జనాభాలో 40 శాతం మంది 1 నుంచి 18 ఏళ్ల వయస్సువారే. వారి ఎదుగుదలకు అడ్డుకట్టగా మారుతున్న పేదరికం, అసమానతలు అధిగమించే ప్రయత్నాలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఈ సర్వే తేల్చి చెబుతోంది.   

మరిన్ని వార్తలు