ఫిట్‌ ప్యాక్టర్‌ హైదరాబాద్‌గా కేసరి లావణ్య ఎంపిక

2 Jul, 2018 10:37 IST|Sakshi
కేసరి లావణ్య

సాక్షి, హైదరాబాద్‌‌: శరీర దారుఢ్య పోటీల్లో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కఠిన కసరత్తులతో కండలు పెంచి బాడీ బిల్డింగ్‌ పోటీల్లో సత్తా చాటుతున్నారు. బాడీ పవర్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యుకె) సంస్థ ఇటీవల నిర్వహించిన ఫిట్‌ ఫ్యాక్టర్‌ హైదరాబాద్‌ పోటీల్లో నగరంలోని అంబర్‌పేటకు చెందిన కేసరి లావణ్య ఎంపికయ్యారు. ఈ నెల 23న నగరంలోని సోమాజిగూడలో గల జయగార్డెన్‌లో స్త్రీలు, పురుషుల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. మహిళా విభాగంలో హైదరాబాద్‌ నుంచి ఇద్దరు, అస్సాం నుంచి ఒకరు పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న ముగ్గురు మహిళలకు జడ్జీలు కుమార్‌ మన్నాప్, డాన్‌ లయన్, బాలకృష్ణ, భరత్‌తేజ్‌ల సమక్షంలో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో కేసరి లావణ్య ప్రథమ స్థానానికి ఎంపికైంది.

ఈ సందర్భంగా విలేకరులతో కేసరి లావణ్య మాట్లాడుతూ.. ఫిట్‌ ప్యాక్టర్‌  పోటీలో తాను ప్రథమ స్థానంలో రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో జాతీయ స్థాయిలో స్క్వాడ్స్‌ ఫిట్‌నెస్‌ సంస్థ ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి ట్రాన్స్‌ఫర్‌ మిషన్‌ చాలెంజీ పోటీలలో మిసెస్‌ ఇండియా డివోటెడ్‌ 2017 రన్నర్‌గా నిలిచానని తెలిపారు. ఫిట్‌నెస్‌లో జాతీయ స్థాయిలో అవార్డులు గెలిచేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను ఫిట్‌నెస్‌ రంగంలో రాణించేందుకు తన భర్త శ్రీకాంత్‌ ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడిందన్నారు. 

మరిన్ని వార్తలు