మహాగణపతిం.. సప్తవర్ణ శోభితం

23 Aug, 2019 11:15 IST|Sakshi

ప్రత్యేక శోభలో  ఖైరతాబాద్‌ మహాగణపతి

500 లీటర్లతో రంగులు

మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి  

ఖైరతాబాద్‌: ఈ సంవత్సరం ద్వాదశాదిత్య మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చేందుకు గణనాథుడు సిద్ధమవుతున్నాడు. వినాయచకవితి  సమీపిస్తుండటంతో (వచ్చే నెల 2న) పెయింటింగ్‌ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. 61 అడుగుల ఎత్తులో మహాద్భుత రూపంలో భక్తులకు దర్శనమిచ్చే విధంగా రూపొందించిన మహాగణపతి కాకినాడ, గొల్లపాలెంకు చెందిన గేసాల వీర భీమేశ్వర్‌రావు ఆధ్వర్యంలో సత్యార్ట్స్‌ పేరుతో ఐదుగురు ఆర్టిస్టులు, 15 మంది పెయింటర్లు  తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మహాగణపతికి వాటర్‌ కలర్స్‌ను ఉపయోగిస్తున్నారు.  

ఏడు రంగులతో తుది మెరుగులు 
శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ తయారుచేసిన అద్భుత రూపానికి సప్తవర్ణాలతో రంగులు అద్దుతున్నారు.  
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌పై మొదటగా 60 లీటర్ల ప్రైమర్,
ఆభరణాలకు గోల్డ్‌ కోటింగ్‌ (గోల్డ్‌ కలర్‌ ) 60 లీటర్లు
మహాగణపతి శరీరానికి (స్కిన్‌ కలర్‌) 60 లీటర్లు,
పంచె ఇతరత్రా (పసుపు రంగు) 35 లీటర్లు
 బ్యాక్‌ గ్రౌండ్‌ ఇతరత్రాలకు (నెవీ బ్లూ) 30 లీటర్లు
మహాగణపతి పక్కన ఉన్న అమ్మవారి చీరలు ఇతరత్రాలకు (ఎరుపు రంగు) 20లీటర్లు, అమ్మవారి దుస్తులకు (ఆకుపచ్చ రంగు) 25 లీటర్లు
పాములు (బ్రౌన్‌ కలర్‌) 60 లీటర్లు,  
కిరీటాలు, ఆభరణాలకు 6 వర్ణాలతో 50 లీటర్లు
తెలుపు రంగు 60లీటర్లు, చివరగా క్లియర్‌ వార్నిష్‌ 40 లీటర్లు  మొత్తంగా 500 లీటర్ల రంగులను మహాగణతికి  వినియోగిస్తున్నారు.  వరుసగా 10వ సంవత్సరం ఖైరతాబాద్‌ మహాగణపతికి తుది మెరుగులు దిద్దేందుకు రావడం సంతోషంగా ఉందని పేయింటర్‌ భీమేశ్వర్‌రావు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో పేయింటింగ్‌ పనులు పూర్తవుతాయన్నారు.

మరిన్ని వార్తలు