4 రోజుల ముందే ఖైరతాబాద్ గణపతి దర్శనం

5 Sep, 2015 17:58 IST|Sakshi

ఖైరతాబాద్ (హైదరాబాద్) : ఈ సంవత్సరం వినాయక చవితికి నాలుగైదు రోజుల ముందే ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమివ్వనున్నాడు. 59 అడుగుల ఎత్తులో ఉండే ఈ విగ్రహం తయారీ పనులు పూర్తికావడంతో శనివారం రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. ఈ ఏడాది నాలుగైదు రోజుల ముందే మహాగణపతి భక్తులకు దర్శనమిస్తాడని చెప్పారు.

అరవయ్యేళ్ల కిందట 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశుని ప్రస్థానం గత ఏదాడికి 60 అడుగులకు చేరుకుంది. అయితే ఈ ఏడాది నుంచి విగ్రహం ఎత్తు ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వస్తామని నిర్వాహకులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సంవత్సరం 59 అడుగుల ఎత్తుతో త్రిశక్తిమయ మోక్షగణేశునిగా కొలువుదీరనున్నాడు లంబోదరుడు.

మరిన్ని వార్తలు