గంగమ్మ ఒడి చేరిన మహాగణపతి

23 Sep, 2018 07:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యాహ్నం ఒంటిగంటలోపే గణపతి నిమజ్జనం పూర్తయింది.  తొమ్మిది రోజుల పాటు అశేష భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్‌ గణనాథుని శోభయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. టెలిఫోన్‌ భవన్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, సెక్రటేరియట్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా మహాగణపతి నిమజ్జనం కోనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరో నంబర్‌ క్రేన్‌ వద్ద శోభాయాత్ర చేరుకుంది. నగరంలో వైభవంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం అప్‌డేట్స్‌ ఇవి.

  • టాంక్ బండ్‌కు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు
  • హుస్సేన్ సాగర్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు బారులు తీరిన గణనాధుల శోభాయాత్ర రథాలు
  • గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 51,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగాయి. ఒక్క ట్యాంక్‌బండ్‌లోనే 16 వేల విగ్రహాల నిమజ్జనం కానున్నాయి. ట్యాంక్‌బండ్‌పై 29 క్రేన్లు, నెక్లెస్ రోడ్ మార్గంలో 9క్రేన్లు.. మొత్తం 38 క్రేన్ల ఏర్పాటు చేశాం.
    - దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్
  • వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్న వినాయకుడి విగ్రహాలతో ట్యాంక్‌ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లో వినాయకుడి విగ్రహాలు బారులు తీరాయి.
  • నిర్విరామంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ సప్త ముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర.. ఇప్పటికే సెన్సేషన్ థియేటర్ దాటి వాసవీ అతిధిగృహం వరకు చేరుకున్న శోభా యాత్ర.. ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభం కావటం.. పెద్దగా భక్తులు రాకపోవటంతో నిమజ్జనం ఘాట్‌కు ప్రశాంతంగా సాగుతున్న శోభాయాత్ర.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మధ్యాహ్నం 12 గంటలలోపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం.


     

  • నగరంలో వినాయక నిమజ్జనానికి ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ సాయం అందిస్తోంది. నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్‌ స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందిస్తోంది. నగరంలో సాగుతున్న వినాయక శోభాయాత్ర వీఆర్‌ డీవోటీ యాప్‌ తిలకించవచ్చు.


     

  • ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఉప రాష్ట్రపతి హోదాలో తొలిసారి నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించనున్న వెంకయ్యనాయుడు. ఆయన రాక సందర్భంగా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు.
     
  • నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి హుస్సెన్‌సాగర్‌కు పెద్ద ఎత్తున గణనాథులు తరలివస్తున్నాయి. మొత్తం 200 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో క్రేన్‌ వద్ద గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు. నిమజ్జన రూట్లలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
     

మరిన్ని వార్తలు