కారేపల్లి యువతి.. అసోంలో ...

13 Sep, 2018 06:47 IST|Sakshi
శిరీష (ఫైల్‌)

కారేపల్లి (ఖమ్మం): కారేపల్లి యువతి.. అసోంలో మృతిచెందింది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాలు... కారేపల్లి అంబేడ్కర్‌ సెంటర్‌కు చెందిన  బాణోతు శిరీష(22), పేరుపల్లి గ్రామానికి చెందిన వరుసకు బావ అయిన అజ్మీర నరేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. నరేష్, బీఎస్‌ఎఫ్‌ (సరిహద్దు రక్షణ దళం) కానిస్టేబుల్‌గా అసోం రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ దంపతులు ఇక్కడి నుంచి రైలులో అస్సాం బయల్దేరారు. మంగళవారం సాయంత్రం అక్కడకు చేరుకున్నారు.

అప్పటికే ఆమె జ్వరంతో బాధపడుతోంది. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయినప్పటికీ జ్వరం తగ్గలేదు. అలాగే అసోం వెళ్లింది. మంగళవారం రాత్రి జ్వరం (డెంగీ) మరింత తీవ్రమైంది. అదే రోజు రాత్రి మృతిచెందింది. ఆమె తండ్రి జామ్లా నాయక్, టేకులపల్లి మండలంలో ఆర్‌ఐగా పనిచేస్తున్నారు. తల్లి జమున, గార్ల మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తమ కూతురు ఇక లేదన్న సమాచారాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అసోం కోల్‌కతాకు, అక్కడి నుంచి సికింద్రాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విమానంలో మృత దేహం చేరుకుటుందని, అక్కడి నుంచి అంబులెన్స్‌లో కారేపల్లికి గురువారం తెల్లవారుజామున తీసుకొస్తామని కుటుంబీకులు తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త ఈవీఎంలు వచ్చేశాయ్‌..

వారధికి ముప్పు

మాతా శిశు కేంద్రంలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌

చెన్నూర్‌లో టికెట్టు కోసం పోటాపోటీ

‘వెలుగు’తోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కథ ముఖ్యం అంతే! 

డాడీ కోసం డేట్స్‌ లేవ్‌!

దాచాల్సిన అవసరం లేదు!

గురువారం గుమ్మడికాయ

శ్రీకాంత్‌ అడ్డాలతో నాని?

కెప్టెన్‌ ఖుదాబక్ష్‌