టీఆర్‌ఎస్‌కు షాక్‌.. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా

2 Feb, 2019 20:25 IST|Sakshi

ఖమ్మం జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత రాజీనామా

సాక్షి​, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్నన్‌కు అందజేశారు. గత కొంతకాలంగా పార్టీలో ఆమెకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వక పోవడంతో రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి మధిర స్థానంలో పోటీ చేయాలని ఆమె భావించారు. కానీ మధిర టికెట్‌ను ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ వర్గానికి చెందిన లింగాల కమల్‌ రాజ్‌కు ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కవిత 2014లో రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీ చైర్‌పర్సర్‌గా ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బుడాన్‌ బేగ్‌ కూడా పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు