కదులుతున్న కిడ్నీ రాకెట్ డొంక..

27 Feb, 2015 23:10 IST|Sakshi

హైదరాబాద్ సిటీ : కిడ్నీ రాకెట్ ఉదంతంలో మరిన్ని విషయాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టారు. ఈనెల 16న నగర టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి ఈ కిడ్నీ రాకెట్ గుట్టును రట్టు చేసి, డాక్టర్ హర్‌దేష్ సక్సేనా అలియాస్ కుమార్ సక్సేనా (60),డిగ్రీ విద్యార్థి ఎ.అశోక్ (22), వ్యాపారి కె.రాఘవేందర్ (34), పాస్‌పోర్టు బ్రోకర్ సంజయ్‌కుమార్ జైన్(32)లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల ఈ నలుగురినీ కోర్టు ఆదేశం మేరకు నాలుగు రోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో గురువారం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

విచారణలో మరిన్ని ఆసిక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు అందరూ భావిస్తున్నట్లు అసలు సూత్రధారి డాక్టర్ సక్సేనా కాదని చెన్నైకి చెందిన రామ్ అని తేలింది. సక్సేనా భార్య కూడా నిందితురాలని తేలింది. పరారీలో ఉన్న రామ్, సక్సేనా భార్యాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుృ బందం ఒకటి చెన్నైకి వెళ్లింది. అసలు సూత్రధారి రామ్ పట్టుబడితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు