పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు

30 May, 2017 02:04 IST|Sakshi
పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు

► ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి బాధితుడి కుటుంబ సభ్యుల వినతి

వికారాబాద్‌ అర్బన్‌: పోలీసులు అకారణంగా ఓ యువకుడిపై దాడి చేయడంతో రెండు కిడ్నీలు పాడై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి బాధ్యులైన ఎస్‌ఐ తోపాటు కానిస్టేబుళ్లపై బాధితుడి కుటుం బ సభ్యులు సోమవారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్‌ మండలం ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి డిగ్రీ పూర్తి చేశాడు. మోమిన్‌పేట మండల కేంద్రంలో ఫర్టిలైజర్‌ షాపు ప్రారంభిద్దామని మండల వ్యవసాయ అధికారి(ఏవో) నీరజను సంప్రదించాడు.

2 నెలలపాటు కార్యాలయానికి తిప్పించుకున్న ఆమె వ్యాపారానికి అనుమతి ఇచ్చేందుకు రూ.20 వేల లంచం ఇవ్వా లని అడిగారని బాధితుడు ఆరోపిస్తు న్నాడు. దీనికి కన్నారెడ్డి అంగీకరించక పోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరి గింది.  ఈ నెల 20న మోమిన్‌పేట పోలీ సులకు నీరజ ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రాజు కార్యాలయానికి వెళ్లి కన్నారెడ్డిని చితకబాదారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులతో తీవ్రంగా కొట్టిం చారు.

తీవ్ర అస్వస్థతకు గురైన కన్నారెడ్డిని కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అతడి రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం కన్నా రెడ్డి ఆస్పత్రిలోనే చికిత్స పొందున్నాడు.   ఎస్‌ఐతోపాటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబీకులు  వికారాబాద్‌ ఎస్పీ అన్నపూర్ణను కలసి విజ్ఞప్తి చేశారు.   
 

మరిన్ని వార్తలు