కింగ్ మేకర్లు కాదు.. కింగ్‌లే కావాలి

15 Sep, 2014 02:59 IST|Sakshi
కింగ్ మేకర్లు కాదు.. కింగ్‌లే కావాలి

కరీంనగర్ రూరల్ :
 గ్రామాల్లో కింగ్ మేకర్లుగా ఉన్న మున్నూరుకాపులు ఇకనుంచి కింగ్‌లుగా మారాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కరీంనగర్ మండలం బొమ్మకల్ లోని మున్నూరుకాపు హాస్టల్‌లో ఆదివారం నిర్వహించిన మున్నూరుకాపు ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మానం, వన భోజన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో మున్నూరుకాపుల జనాభా ఎక్కువగా ఉందని, రిజర్వేషన్లతోనే రాజకీయాల్లో భాగస్వామ్యం పెరిగిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో బీసీలకు ఉన్నత పదవులు లభించినట్లు చెప్పారు కులస్తులంతా కలిసికట్టుగా ఉండి రాజకీయాల్లో రాణించాలని  రామగుండం, మంథని ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు సూచించారు. హాస్టల్ నిర్మాణానికి  తన కోటా నుంచి రూ. 20లక్షలు మంజూరు చేస్తానని  కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. బొమ్మ వెంకటేశ్వర్లును  మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం మంత్రి రామన్నతోపాటు పలువురు ప్రజాప్రతినిధులను సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఆహ్మాన కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సాన మారుతి, బిరుదు రాజమల్లు, మాజీ అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, కరీంనగర్ డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎల్. రాజయ్య, జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్, అర్బన్‌బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు బండి సంజయ్‌కుమార్, గందె మాధవి, శ్రీదేవి, స్వరూపరాణి, ఆకులప్రకాశ్, బండారి వేణు, శ్రీకాంత్, సంఘం నాయకులు కాశెట్టి శ్రీనివాస్, నందెల్లి ప్రకాశ్,జంగిలిసాగర్, దాది సుధాకర్, చెట్టి జగన్,నలువాల రవీందర్, చల్లా హరిశంకర్, రామస్వామి, భూమయ్య, రవికిరణ్, నరేందర్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.


 


 

మరిన్ని వార్తలు