రాజ్యాధికారం కోసం ఐక్య ఉద్యమం: ఆర్. కృష్ణయ్య

3 Aug, 2015 01:35 IST|Sakshi
రాజ్యాధికారం కోసం ఐక్య ఉద్యమం: ఆర్. కృష్ణయ్య

నల్లగొండ టౌన్: రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా బీసీ కులాలన్నీ ఐక్యం గా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన బీసీ సమరభేరి మహాసభలో ఆయన మాట్లాడారు. అన్ని  పార్టీలు బీసీలను జెండాలు మోసే కూలీలుగా చూస్తున్నాయని ధ్వజమెత్తారు. బీసీలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకుంటే మనమే ఒక పార్టీని పెట్టుకొని, వచ్చే ఎన్నికల్లో బీసీలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకోవాలని కోరారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లును పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలకు బీసీలు కేవలం 12 మంది మాత్రమే ఉండడం దారుణమన్నారు. 107 కులాలు నేటికీ అసెంబ్లీ గేటును దాటకపోవడం  శోచనీయన్నారు.  కార్యక్రమంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ కృష్ణమోహన్, నీలం వెంకటేశ్ మాట్లాడారు.

మరిన్ని వార్తలు