కిన్నెరసాని డీర్ పార్క్‌కు 40 ఏళ్లు

29 Sep, 2014 02:31 IST|Sakshi

పాల్వంచ రూరల్: పాల్వంచ పరిధిలోని కిన్నెరసానిలో జింకల పార్క్ ఏర్పాటుచేసి నేటికి 40సంవత్సరాలు పూర్తైది. పాల్వం చ మండలంలోని యానంబైల్ గ్రామ పంచాయతీ కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలో 30 జింకలతో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ను 1974 సెప్టెంబర్ 29వ తేదీన అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళవారం ప్రారంభించారు. అప్పటినుంచి సింగరేణి యాజమాన్యం దీనిని పర్యవేక్షించింది. పర్యాటకులకోసం కిన్నెరసాని రిజర్వాయర్ వద్ద సింగరేణి ఏర్పాటు చేసిన అద్దాల మేడను  2000 సంవత్సరంలో మావోయిస్టులు డిటోనేటర్ల ద్వారా పేల్చి వేయడంతో అద్దాల మేడ, పది కాటేజీలు, జింకల పార్కు నిర్వహణ బాధ్యతలను వన్యమృగ సంరక్షణ అధికారులకు అప్పగించారు.

అప్పటి నుంచి వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించి జింకల పార్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభంలో 30 జింకలు ఉండగా క్రమక్రమం గా అధికారులు పార్క్ విస్తీర్ణం పెంచి 110 జింకలకు పెంచారు. రాష్ట్రంలోనే అరుదుగా కనిపించే కృష్ణ జింకలు కిన్నెరసాని రిజర్వాయర్‌కు వచ్చే పర్యాటకులకు ముందుగా కనువిందు చేస్తాయి. పార్క్‌లో ఉండే జింకలకు గ్రాస్‌తోపాటు తాటి చెట్టు కర్ర తొట్లను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పిచేవారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సిబ్బందితో  జింకలకు గడ్డి, 120 కేజీల ఫీడ్‌ను పోషకాహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డీర్ పార్క్ 40 జింకలు మాత్రమే సరిపోతుంది. కానీ స్థాయికి మించి జింకలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు