గాంధీ ఆసుపత్రికి తరలింపు

25 Apr, 2020 15:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రామాంతపూర్‌లోని ఓ కిరణా వర్తకుడికి కరోనా పాజిటివ్ కలకలం రేపుతోంది. అతడిని చికిత్స నిమిత్తం శనివారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితుడి కుటుంబ సభ్యులైన మరో ఇద్దరిని పోలీసులు క్వారంటైన్‌కు పంపించారు. సదరు పాజిటివ్‌ వ్యక్తి నాగోల్‌లోని తన బంధువులను ఇటివల కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తి కలిసిన అతడి బంధువులను, కిరాణా షాపులో వస్తువులు కొన్న వారిపై ఆరా తీస్తున్నారు.  కాగా కిరాణా షాపు వర్తకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో స్థానికులు భయాందోళనకు  గురవుతున్నారు. ఇక సదరు బాధితుడు నివాసం ఉంటున్న శ్రీరమనపురంలోని కాలనీలకు జీహెచ్‌ఎంసీ బారీకేడ్లతో శుభ్రత చర్యలు చేపట్టింది.

ఈ ఫొటోలోని చిన్నారికి కరోనా లేదు

మరిన్ని వార్తలు