ఒక్క క్లిక్‌తో కిసాన్‌ సమ్మాన్, రైతుబంధు స్టేటస్‌ 

17 Sep, 2019 09:35 IST|Sakshi
రైతుబంధు పథకం యాప్‌

నాగారం (తుంగతుర్తి): రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం కిసాన్‌ సమ్మాన్, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టాయి. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క రైతు కుటుంబానికి మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఏడాదికి 2విడతల్లో ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేస్తోంది.  ఈ పథకాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకునే విధంగా ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.

పీఎం కిసాన్‌సమ్మాన్‌ సమాచారం తెలుసుకునేందుకుప్రభుత్వం www.pmkisan.gov.in లోకి వెళ్లి బెన్‌ఫిషియర్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తరువాత ఆధార్‌నంబర్‌ లేదా బ్యాంక్‌ అకౌంట్‌ లేదా మొబైల్‌నంబర్‌ ఎంటర్‌ చేస్తే మీకు  బ్యాంకులో డబ్బులు పడ్డాయో లేదో తెలుస్తుంది. అలాగే రైతుబంధు సమాచారాన్ని కూడా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.https://ifmis.telangana.gov.in లోకి వెళ్లి స్కీంవైజ్‌ రిపోర్టుపై క్లిక్‌ చేయాలి. అప్పుడు సంవత్సరం వద్ద 2019–2020 అని, పథకం వద్ద రైతుబంధు అని, కొత్తపట్టాదారుపాస్‌ బుక్‌నంబర్‌ ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ క్లిక్‌ చేస్తే సమాచారం తెలుస్తుంది. ఇలా ఇంటర్‌నెట్‌ ద్వారా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు