కిషన్‌రెడ్డికి మాతృవియోగం

25 Apr, 2019 07:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి  కిషన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి గంగాపురం ఆండాలమ్మ (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు.  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అండాలమ్మ మృతికి పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు.

గంగాపురం స్వామిరెడ్డి (కిషన్ రెడ్డి తండ్రి) 1993లో  అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన సతీమణి ఆండాలమ్మ గుండెపోటుతో నేడు అపోలోలో చికిత్స పొందుతూ పరమపదించారు. భర్త మరణానంతరం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లొనే ఉన్నారు. స్వామిరెడ్డి, ఆండాలమ్మకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. హనుమాన్ జయంతి రోజు హైదరాబాద్‌కు వచ్చిన ఆండాలమ్మ అనారోగ్యంగా ఉండటంతో హైదర్‌గూడ అపోలోలో బుధవారం వేకువ జామున జాయిన్ అవ్వగా.. చికిత్స పొందుతూ నేడు వేకువజామున 2 గంటలకు పరమపదించారు. అమ్మ మృతితో కిషన్ రెడ్డి కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది.

మరిన్ని వార్తలు