‘టిమ్స్‌ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి’

12 Jul, 2020 10:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్‌ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం‌ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే  తెలంగాణలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి ఈటల రాజేందర్‌, ఆధికారులతో మాట్లాడినట్లు వ్యాఖ్యానించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై తర్వాత  హైద్రాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. (కరోనా రోగి పట్ల అమానుష ప్రవర్తన )

కేంద్రం నుంచి తెలంగాణకు 600 వెంటిలేటర్లు పంపించామని కిషన్‌రెడ్డి చెప్పారు. వైద్య సిబ్బందికి, కరోనా బాధితులకు ధైర్యం కల్పించటానికే గాంధీ ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో 250పైగా వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలన్నారు. గాంధీలో పేషెంట్లకు మానసిన ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత స్థానిక ఎంపీగా తనపై ఉందని తెలిపారు. ప్రస్తుతానికి కోవిడ్‌కు వ్యాక్సిన్ లేదని ప్రజలే తమను తాము సురక్షించితంగా కాపాడుకోవాలని పేర్కొన్నారు. (వైరస్‌ వ్యాప్తి: ఆ రెండూ వేర్వేరు అంశాలు)

మరిన్ని వార్తలు