‘కల్యాణలక్ష్మి’ వచ్చేసింది..

23 Apr, 2016 03:23 IST|Sakshi
‘కల్యాణలక్ష్మి’ వచ్చేసింది..

భువనగిరి : బీసీ, ఈబీసీలకు కల్యాణ లక్ష్మి పథకం వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు కల్యాణ లక్ష్మి, ముస్లిం మైనార్టీలకు షాదీముభారక్ పే రుతో ప్రభుత్వం రూ.51 వేల ఆర్థిక సాయం ఇప్పటికే చేస్తోంది. అయితే బీసీలకూ ఈ పథకం వర్తింపజేయాలనే పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందుకేసీ బీసీలతో పాటు ఈబీసీలకు కూడా కల్యాణ లక్ష్మి వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో నుంచి పథకం అమలులోకి రానుంది. ఉన్నత కులాల్లోని పేదవారికి కూడా ఈ పథకంలో అమ్మాయిల వివాహసమయంలో ఆర్థిక సాయం అందనుంది. రూ.2 లక్షల లోపు ఆదాయం కలిగిన తల్లిదండ్రుల కుమార్తెలకు ఈ పథకం కింద  వివాహానికి రూ.51 వేల ఆర్థిక సాయం అందనుంది. ఇందుకోసం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సర్కారు తీసుకున్న నిర్ణయం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
నిబంధనలు ఇవే...
18 సంవత్సరాలు నిండిన యువతులు ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవాలి. మీసేవ కేంద్రంలో, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరకాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంతో పాటు వివాహ నమోదు పత్రం, పుట్టిన తేదీ, కులం, ఆదా యం, పదో తరగతి ధ్రువ పత్రాలుదృవ, ఆధార్‌కార్డు,పెండ్లి పత్రిక, బ్యాంకు పాస్‌పుస్తకం నకలు జత చేయాలి.
 
సీఎంకు కృతజ్ఞతలు...
-కె.అమరేందర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు
బీసీ, ఈబీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై సంతోషంగా ఉంది. ఆయనకు నా కృత జ్ఞతలు. లక్షలాది మంది పేదింటి ఆడపిల్లల వివాహానికి ఉపయోగపడే ఈ పథకంతో కేసీఆర్ అందరి హృదయాల్లో నిలిచిపోతారు.

మరిన్ని వార్తలు