అయినవారే ‘అదృశ్య’శక్తులు! 

31 Jul, 2019 01:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వారం క్రితం సోనీ కిడ్నాప్‌.. రెండు రోజులకు ముందు గజేందర్‌ అపహరణ.. నగరంలో ఇలా ఏదో ఓ చోట కిడ్నాప్‌ కేసులు  నమోదవుతున్నాయి.  ఏటా వందల సంఖ్యలో  కిడ్నాప్‌ కేసులు నమోదవుతుంటాయి. ఇటీవల  డబ్బు కోసం జరుగుతున్న కిడ్నాపుల్లో 95 శాతం పరిచయస్తులే సూత్రధారులు. మంగళవారం కొలిక్కి చేరిన గజేంద్ర–అల్మాస్‌ వ్యవహారం ఈ కోవకు చెందినదే.

ఇలాంటి కేసులు సిటీలో గరిష్టంగా 20 నుంచి 30 వరకు నమోదవుతుంటాయి. మిగిలిన కిడ్నాప్‌ కేసుల్లో అత్యధికం మైనర్ల మిస్సింగ్‌కు సంబంధించినవే. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. చిన్నారులు అదృశ్య మైన సందర్భంలో కిడ్నాప్‌ కేసు నమోదు చేస్తుండటంతోనే ఈసంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. 
 

మరిన్ని వార్తలు