పీజీ మెడికల్‌ డెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ 

9 May, 2020 04:21 IST|Sakshi

నేటి నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు నీట్‌–2020లో అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం ఉదయం 11 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్‌ చేయాలని పేర్కొంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు https://pvttspgmed.tsche.in వెబ్‌సైట్‌లో ఉంటాయని, ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను యూనివర్సిటీ విడుదల చేస్తుందని తెలిపింది. దరఖాస్తుకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు 9704093953, 8466924522లను సంప్రదించాలని సూచించింది. పూర్తి సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌  www.knruhs. telangana.gov.in ను సందర్శించవచ్చని పేర్కొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు