కోడెల తరలింపుపై వాయిదా తీర్మానం తిరస్కరణ

22 Dec, 2016 01:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొమురవెల్లి మల్లన్న భక్తులు మొక్కుబడి కింద సమర్పించిన కోడెలు, లేగదూడలను కబేళాలకు తరలిస్తున్న తీరుపై చర్చించడానికి టీడీపీ బుధవారం శాసనసభలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది.

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. మల్లన్నకు మొక్కుల రూపంలో భక్తులు ఇచ్చిన కోడెలను వేలంలో కొనుగోలు చేసి కబేళాకు తరలిస్తున్న తీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఘోరం మల్లన్నా.. ఘోరం! )

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు