జీవితమే ఒక ‘ఆట’

14 Nov, 2014 02:03 IST|Sakshi
జీవితమే ఒక ‘ఆట’

ఈ చిత్రాలు చూశారా.. ఓ ఫొటో ఇండియూ ఖోఖో కప్పు సాధించిన జట్టు సభ్యులతో సారంగపాణి.. మరో చిత్రంలో కటింగ్ చేస్తున్నది కూడా సారంగపాణియే.. జాతీయ స్థారుులో ఆడిన వ్యక్తి సెలూన్ షాప్‌లో పనిచేయడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా.. ఇదీ నిజం..! ఎన్ని పతకాలు సాధించినా.. అవార్డులు వరించినా.. ఏవీ కడుపునింపలే.. ప్రస్తుతం కులవృత్తే ఆకలి తీరుస్తోంది! ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఉద్యోగం ఇవ్వాలని సారంగపాణి  కోరుతున్నాడు..
 
ఖిల్లా నుంచి మొదలు..
వరంగల్ కోటకు చెందిన నాగవెల్లి సారంగపాణికి చిన్నతనం నుంచే ఆటలపై ఎంతో ఆసక్తి ఉండేది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న సారంగపాణికి ఖోఖో అంటే చచ్చేంత ప్రాణం. అయితే ఖోఖోపై అతడికి ఉన్న అభిరుచిని గమనించిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అందులో నైపుణ్యాలు నేర్పించారు.

ఇందులో భాగంగా పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏటా నిర్వహించే పోటీల్లో సారంగపాణి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించేవాడు. కాగా, 1999లో మణిపూర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు  సారథ్యం వహించి బ్రౌంజ్ మెడల్‌ను సంపాదించాడు. 1996లో మొదటిసారిగా అం తర్జాతీయస్థాయిలో కోల్‌కతాలో నిర్వహించిన ఏషియన్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టోర్నమెంట్‌లో భారతజట్టు బం గారు పతకం సాధిం చేందుకు సారంగపాణి ఎంతో కృషిచేశాడు.

ప్రోత్సాహం కరువు..
నిరుపేద కుటుంబానికి చెందిన సారంగపాణికి ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాడు. ఖోఖోలో మేరునగధీరుడిగా పేరుగాంచిన సారంగపాణికి కొన్ని నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులు నీడలా వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో 2001 వరకు పోటీ ల్లో పాల్గొన్న అతడు ది క్కుతోచని పరిస్థితిలో ఖోఖోకు స్వస్తిపలికి కు టుంబపోషణ కోసం కులవృత్తి సెలూన్‌షాపు ను పెట్టుకుని పనిచేస్తున్నాడు. దీంతో రోజు వచ్చే అరకొర సంపాదన తో అనారోగ్యంతో బా ధపడుతున్న తల్లికి వైద్యం చేయిస్తూ జీవిస్తున్నాడు.

మంత్రి హామీ బుట్టదాఖలు..
అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడిగా పేరు సంపాదించిన సారంగపాణికి  అప్పటి హోంశా ఖ మంత్రి దేవేందర్‌గౌడ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే మంత్రి హామీ అమలు కోసం ప్రభుత్వం వద్దకు తిరిగినా సారంగపాణికి ఉద్యో గం రాలేదు. అటు ఉద్యోగం రాక... షాపు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో కొన్నేళ్ల నుంచి సారంగపాణి మరో షాపులో కూలీగా పనిచేస్తున్నాడు.
 
సారంగపాణి ట్రాక్ రికార్డ్
పశ్చిమబెంగాల్‌లో 1988లో నిర్వహించి న సబ్‌జూనియర్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు.
మహారాష్ట్రలోని సతారాలో 1992లో జరిగిన నేషనల్ స్కూల్‌గేమ్స్‌లో రజత పతకం సాధించాడు.
1996లో కోల్‌క తాలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్‌లో ఏపీ జట్టుకు బంగారు పతకాన్ని సాధించిపెట్టాడు.
మణిపూర్‌లో 1999లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఏపీ తరపున ఆడి బ్రౌంజ్‌మెడల్ సాధించాడు. అలాగే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
1998లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో చాంపియన్ సాధించాడు.
1994లో హర్యానాలో జరిగిన సీనియర్ ఖోఖో పోటీల్లో చాంపియన్‌షిప్ సాధిం చాడు.  అలాగే పలు పోటీల్లో ప్రతిభ కనబరిచాడు.

మరిన్ని వార్తలు