ఆర్‌.నారాయణమూర్తికి కొమరం భీమ్‌ పురస్కారం

5 Oct, 2017 19:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తికి ప్రతిష్టాత్మక  ‘కొమరం భీమ్ జాతీయ  పురస్కారం’  లభించింది. తెలంగాణ టెలివిజన్  డెవలప్‌మెంట్  ఫోరమ్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్, గోండ్వానా సాంస్కృతిక పరిరక్షణ దళం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది అందించే ఈ అవార్డుకు... ఈ ఏడాది ఆర్‌.నారాయణమూర్తిని ఎంపికి చేసినట్లు అవార్డు కమిటీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు  కేవీ రమణాచారీ తెలిపారు. ఈ నెల 3వ వారం  జరిగే అవార్డు ప్రదానోత్సవంలో   51 వేల రూపాయల  నగదుతో పాటు,  జ్ఞాపిక, ప్రశంస పత్రం, శాలువాతో సత్కరిసున్నట్టు కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ పేర్కొన్నారు.

గతంలో ఈ అవార్డును కొమరం భీమ్‌ చిత్ర నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్‌, గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అందుకున్నారు. కాగా  ప్రజలను చైతన్యపరిచేలా ఆర్‌. నారాయణమూర్తి పలు చిత్రాలను నిర్మించారు. అర్థరాత్రి స్వతంత్రం, అడివి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగు చుక్కలు, అరణ్యం, ఎర్రోడు, సింగన్న లాంటి పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

మరిన్ని వార్తలు