పేదల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

15 Nov, 2018 12:23 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

 కనగల్‌ మండలంలో ప్రచారం.

సాక్షి,కనగల్‌ (నల్లగొండ) : పేదల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బుడమర్లపల్లి, బోయినపల్లి, కుమ్మరిగూడెం, బచ్చన్నగూడెం, మార్తినేనిగూడెం, జి.యడవల్లి, రామచంద్రాపురం, తుర్కపల్లి, బొమ్మెపల్లి, ఎం. గౌరారం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బోయినపల్లిలో కోమటిరెడ్డి మహిళలతో కలిసి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలన్నారు. కేసీఆర్‌ అబద్ధపు హామీలతో ప్రజలను మరోమారు మోసం చేయాలని చూస్తున్నాడన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిండన్నారు.

దళితులకు మూడెకరాల భూమి లేదు, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లులేవు, దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు, ఇంటికో ఉద్యోగంలేదు, ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్‌ ఆయన కుటుంబాన్ని మాత్రం బంగారుమయం చేసుకున్నాడన్నారు. శ్రీశైలం సొరంగం పూర్తి చేయడం తన జీవితాశయమన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. నల్లగొండ ప్రజలు నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఐదోసారి ఆశీర్వదించాలని కోరారు.ఎన్నికల తర్వాత మంచి స్థానంలోనే ఉంటానని అన్ని అభివృద్ధి పనులను చేస్తామన్నారు. 
సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో సంకేమానికి పెద్దపీట వేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెల్లకార్డు ఉన్న పేదలకు ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. సొంత భూమిలో ఎక్కడైనా ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పారు.  ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ నాయకుడు స్వామిగౌడ్, జెడ్పీటీసీ నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి,  ఏఎంసీ మాజీ చైర్మన్‌ భిక్షం యాదవ్, నాయకులు జగాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రామకృష్ణ, రాంరెడ్డి, పి. రుద్రరాజు, యాదగిరిరెడ్డి, కిరణ్, లింగయ్య, బి.శ్రీను, రాజీవ్, కందుల మారయ్య, ప్రేమయ్య, బి. అంజయ్య, జి. నర్సింహ, హుస్సేన్, భిక్షం, పెంటయ్య, లక్ష్మారెడ్డి, నాగరాజు, పి. సత్తయ్య, మోహన్‌రెడ్డి, పరమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు