సోనియా రుణం తీర్చుకోవాలి

28 Nov, 2018 10:02 IST|Sakshi
ప్రచారం నిర్వహిస్తున్న కోమటిరెడ్డి సతీమణి సబిత

సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్‌ పా ర్టీని గెలిపించి తెలంగా ణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలని నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి సబిత కోరారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 19, 20, 26 వార్డుల్లో గడపగడపకు తిరుగుతూ కోమటిరెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, చైతన్య, గుమ్మల జానకి, తుమ్మల రాధ, కౌన్సిలర్‌ జయప్రకాశ్, సుధాకర్‌రెడ్డి, అస్మత్‌ బస్సుం,  ధనలక్ష్మి, శ్రీలత, సరస్వతి, హరిత, కళావతి, గౌస్‌ మొయినొద్దీన్, బాలరాజు, ఆసిఫ్, ఏంజిల్, రి జ్వాన్,మోయీన్, ప్రవీణ్, శ్రీనివాస్, సోమయ్య పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు