వారు రాజకీయ మానసిక  రోగులు: బూర నర్సయ్య

20 Mar, 2019 03:42 IST|Sakshi

ఆలేరు: కోమటిరెడ్డి సోద రులు రాజకీయ మానసిక రోగులని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ విమర్శించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆలేరు, భువనగిరి, జనగాం నియోజకవర్గాల్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ఎయిమ్స్‌ను తీసుకువస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజకీయాలంటే పక్షులు అటు ఇటు తిరిగినట్లు కాదని, ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ గా, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం సరైంది కాదని దీన్ని రాజకీయ జబ్బు (మెంటలోమానియా) అంటారని విమర్శించారు. ఈ జబ్బు ఉన్నవాళ్లు నేనే చక్రవర్తినని అనుకుంటారని కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చురకలంటించారు. ఈ కార్యక్రమం లో బడుగుల లింగయ్య యాదవ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, రాజీవ్‌సాగర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు