పకడ్బందీగా ‘పంపిణీ’ వ్యవస్థను అమలు చేయాలి 

5 Apr, 2020 02:05 IST|Sakshi

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యతని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం  కావాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలో ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యం ఇవ్వాలనే  నిర్ణయం అభినంద నీయమని, అయితే పంపిణీలో సమస్యలు ఎదురుకావడం సరి కాదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షాపుల ఎదుట భారీ క్యూలు ఉండటం, భౌతిక దూరం పాటించకపోవడం దుష్పరిణామాలకు దారితీయకూడదని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు